
టైటాన్స్‌కు మరో ఓటమి
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్‌లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. తొలి విజయం కోసం ఎదురు చూస్తున్న ఆ జట్టు సోమవారం 27-28 తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడింది. రజ్నీష్ (11) రైడింగ్‌లో మరోసారి మెరిసినా ఫలితం లేకుండా పోయింది. బెంగాల్ జట్టులో మణిందర్ (10) సత్తాచాటాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 50-40తో పుణెరి పల్టాన్‌పై గెలిచింది. యూపీ తరపున సురేందర్ (21) అదరగొట్టాడు. పర్దీప్ (10) కూడా రాణించాడు. పుణెరి జట్టులో అస్లామ్ (16), మోహిత్ (13) ఆకట్టుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.