చరిత్ర సృష్టించిన ఐర్లాండ్
ఐర్లాండ్ జట్టు వెస్టిండీస్‌పై చరిత్రాత్మక సిరీస్ విజయం సాధించింది. చివరిదైన మూడో వన్డేలో రెండు వికెట్ల తేడాతో నెగ్గడం ద్వారా ఐర్లాండ్ 2-1తో సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఓ ఐసీసీ శాశ్వత సభ్య దేశంపై విదేశంలో సిరీస్ గెలవడం ఐర్లాండ్‌కు ఇదే తొలిసారి. ఆండీ మెక్‌బ్రైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన (4/28, 59 పరుగులు)తో
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ 2-1తో కైవసం
కింగ్స్టన్: ఐర్లాండ్ జట్టు వెస్టిండీస్‌పై చరిత్రాత్మక సిరీస్ విజయం సాధించింది. చివరిదైన మూడో వన్డేలో రెండు వికెట్ల తేడాతో నెగ్గడం ద్వారా ఐర్లాండ్ 2-1తో సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఓ ఐసీసీ శాశ్వత సభ్య దేశంపై విదేశంలో సిరీస్ గెలవడం ఐర్లాండ్‌కు ఇదే తొలిసారి. ఆండీ మెక్‌బ్రైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన (4/28, 59 పరుగులు)తో మూడో వన్డేలో ఐర్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మెక్బ్రైన్తో పాటు క్రెయిగ్ యంగ్ (3/43) విజృంభించడంతో మొదట వెస్టిండీస్ 44.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. హోప్ (53), జేసన్ హోల్డర్ (44) రాణించారు. బ్రైన్, టెక్టర్ (52) రాణించడంతో లక్ష్యాన్ని ఐర్లాండ్ 44.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఐర్లాండ్ 43వ ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయి 208/8తో నిలిచింది. ఆ జట్టు విజయానికి కావాల్సింది అయిదు పరుగులే అయినా, చాలా ఓవర్లు ఉన్నా.. రెండే వికెట్లు చేతిలో ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. కానీ యంగ్ (5 నాటౌట్), అదైర్ (1 నాటౌట్) తడబాటు లేకుండా తమ జట్టును విజయపథంలో నడిపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!