
కరోనా ప్రభావం.. ఐఎస్‌ఎల్ మ్యాచ్ వాయిదా
బాంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్ (ఎస్‌ఎస్‌ఎల్) ఫుట్‌బాల్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. సోమవారం హైదరాబాద్, జంషెడ్‌పూర్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్ధంతరంగా వాయిదా పడింది. జంషెడ్‌పూర్ జట్టులో కొంతమంది ఆటగాళ్లు కరోనా బారిన పడటం.. మ్యాచ్ ఆడేందుకు కావాల్సినంత మంది లేకపోవడంతో వాయిదా తప్పలేదు. ‘‘హైదరాబాద్, జంషెడ్‌పూర్ జట్ల మధ్య మ్యాచ్ వాయిదా పడింది. జంషెడ్‌పూర్ తమ జట్టును బరిలో దింపే స్థితిలో లేకపోవడంతో వైద్య బృందంతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మరో రోజు మ్యాచ్ నిర్వహిస్తాం’’ అని ఐఎస్‌ఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. నిబంధల ప్రకారం మ్యాచ్‌కు 15 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండాలి. ఆదివారం కేరళ, ముంబయి జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. అంతకుముందు మరో రెండు మ్యాచ్‌లూ జరగలేదు. జంషెడ్‌పూర్, మోహన్ బగాన్, గోవా, బెంగళూరు, ఒడిషా జట్లలో పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. బయో బబుల్‌లో ఉన్న హోటల్ సిబ్బందిలో పాజిటివ్ కేసులు రావడంతో ఈస్ట్ బంగాల్ జట్టు ఐసోలేషన్‌లో ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.