బంగ్లాదేశ్‌పై ఇంగ్లాండ్‌ ఘనవిజయం

అండర్‌-19 ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బంగ్లాదేశ్‌కు పేలవ ఆరంభం. ఏకపక్షంగా సాగిన పోరులో ఇంగ్లాండ్‌ 7 వికెట్ల తేడాతో ఆ జట్టును చిత్తు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ తీవ్రంగా తడబడింది.

Published : 18 Jan 2022 03:20 IST

అండర్‌-19 ప్రపంచకప్‌

బసెటెరె: అండర్‌-19 ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బంగ్లాదేశ్‌కు పేలవ ఆరంభం. ఏకపక్షంగా సాగిన పోరులో ఇంగ్లాండ్‌ 7 వికెట్ల తేడాతో ఆ జట్టును చిత్తు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ తీవ్రంగా తడబడింది. బోడెన్‌ (4/16), అస్పిన్‌వాల్‌ (2/18) ధాటికి 35.2 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. జేమ్స్‌ సేల్స్‌, ఫతే సింగ్‌, టామ్‌ ప్రెస్ట్‌ తలో వికెట్‌ పడగొట్టారు. లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 25.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. జాకబ్‌ బెథెల్‌ (44), జేమ్స్‌ రెవ్‌ (26 నాటౌట్‌) రాణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని