
‘నిధులు విడుదల చేయండి’
ఈనాడు, హైదరాబాద్: క్రీడా సంఘాలకు పెండింగ్ నిధుల్ని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) కోరింది. గత కొన్నేళ్లుగా టోర్నీలు నిర్వహించిన క్రీడా సంఘాలకు ప్రభుత్వం నుంచి రూ.3.5 కోట్లు నిధులు రావాల్సి ఉందని శాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డికి రాసిన లేఖలో టీఓఏ అధ్యక్షుడు ప్రొఫెసర్ రంగారావు పేర్కొన్నారు. 2021-22 బడ్జెట్‌లో క్రీడలకు రూ.113 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. క్రీడాకారుల టీఏ, డీఏలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. క్రీడాకారుల భవిష్యత్తు కోసం అప్పులు చేసి అంతర్జాతీయ, జాతీయ స్థాయి టోర్నీలు నిర్వహించిన క్రీడా సంఘాల్ని తక్షణం ఆదుకోవాలని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.