ఉన్ముక్త్‌ అరుదైన ఘనత

భారత అండర్‌-19 జట్టు మాజీ కెప్టెన్‌ ఉన్ముక్త్‌ చంద్‌ అరుదైన ఘనత సాధించాడు. బిగ్‌బాష్‌ టీ20 లీగ్‌లో పాల్గొన్న మొట్టమొదటి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మంగళవారం హోబర్ట్‌

Published : 19 Jan 2022 02:39 IST

మెల్‌బోర్న్‌: భారత అండర్‌-19 జట్టు మాజీ కెప్టెన్‌ ఉన్ముక్త్‌ చంద్‌ అరుదైన ఘనత సాధించాడు. బిగ్‌బాష్‌ టీ20 లీగ్‌లో పాల్గొన్న మొట్టమొదటి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మంగళవారం హోబర్ట్‌ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌కు ఉన్ముక్త్‌ ప్రాతినిధ్యం వహించాడు. నాలుగో నంబరులో బరిలో దిగిన ఉన్ముక్త్‌ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో హోబర్ట్‌ 6 పరుగుల ఆధిక్యంతో మెల్‌బోర్న్‌పై గెలిచింది. 2012లో ఆస్ట్రేలియాలో జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌లో ఉన్ముక్త్‌ సారథ్యంలోని భారత జట్టు విజేతగా నిలిచింది. అనంతరం ఇండియా-ఎకు నాయకత్వం వహించిన ఉన్ముక్త్‌ సీనియర్‌ స్థాయిలో విజయవంతం కాలేకపోయాడు. దీంతో నిరుడు ఆగస్టులో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఉన్ముక్త్‌.. విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు అర్హత సాధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని