నేడు ఐర్లాండ్‌తో యువ భారత్‌ ఢీ

బలమైన దక్షిణాఫ్రికాను చిత్తుచేసి అండర్‌-19 ప్రపంచకప్‌లో ఘనంగా తొలి అడుగు వేసిన యువ భారత్‌.. రెండో పోరుకు సిద్ధమైంది. బుధవారం గ్రూప్‌- బి మ్యాచ్‌లో

Published : 19 Jan 2022 04:26 IST

అండర్‌-19 ప్రపంచకప్‌

సాయంత్రం 6.30 నుంచి

టరౌబా (ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో): బలమైన దక్షిణాఫ్రికాను చిత్తుచేసి అండర్‌-19 ప్రపంచకప్‌లో ఘనంగా తొలి అడుగు వేసిన యువ భారత్‌.. రెండో పోరుకు సిద్ధమైంది. బుధవారం గ్రూప్‌- బి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడుతుంది. సఫారీ జట్టుపై గెలుపుతో ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత కుర్రాళ్లు.. ఐర్లాండ్‌ను చిత్తుచేయాలనే పట్టుదలతో ఉన్నారు. కానీ జట్టు బ్యాటింగ్‌ విభాగం మరింత మెరుగుపడాల్సి ఉంది. గత మ్యాచ్‌లో కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ మినహా మిగతా బ్యాటర్లెవరూ అంచనాల మేర రాణించలేదు. ఆంధ్ర కుర్రాడు షేక్‌ రషీద్‌, కుశాల్‌ మాత్రమే కొన్ని పరుగులు చేయగలిగారు. ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో భారత బ్యాటింగ్‌ జోరందుకోవాల్సి ఉంది. జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఓపెనర్లు హర్నూర్‌ సింగ్‌, రఘువన్షీపై ఉంది. మిడిలార్డర్‌ కూడా లయ అందుకోవాలి. ఇక బౌలింగ్‌లో జట్టు పటిష్ఠంగా ఉంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో జట్టు అనుకున్న దాని కంటే తక్కువ పరుగులే చేసినా.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో స్పిన్నర్‌ విక్కీ, పేసర్‌ రాజ్‌ బవా ప్రధాన పాత్ర పోషించారు. ఈ ఇద్దరు కలిసి ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. వీళ్లకు తోడు పేసర్లు రాజ్‌వర్ధన్‌, రవి కుమార్‌ కూడా రాణిస్తే జట్టుకు తిరుగుండదు. మరోవైపు తమ తొలి మ్యాచ్‌లో ఉగాండాపై గెలిచిన ఐర్లాండ్‌.. భారత్‌కు గట్టి పోటీనివ్వాలనే ఉద్దేశంతో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని