క్వార్టర్స్‌లో ఇంగ్లాండ్‌

అండర్‌-19 ప్రపంచకప్‌ క్వార్టర్స్‌లో చోటు ఖాయం చేసుకున్న తొలి జట్టుగా ఇంగ్లాండ్‌ నిలిచింది. గ్రూప్‌- ఎ మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో కెనడాను చిత్తుచేసిన ఆ జట్టు వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మొదట బ్యాటింగ్‌

Published : 20 Jan 2022 03:13 IST

 అండర్‌-19 ప్రపంచకప్‌

బాస్‌టెర్‌: అండర్‌-19 ప్రపంచకప్‌ క్వార్టర్స్‌లో చోటు ఖాయం చేసుకున్న తొలి జట్టుగా ఇంగ్లాండ్‌ నిలిచింది. గ్రూప్‌- ఎ మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో కెనడాను చిత్తుచేసిన ఆ జట్టు వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 320 పరుగులు చేసింది. కెప్టెన్‌ టామ్‌ ప్రెస్ట్‌ (93), జార్జ్‌ బెల్‌ (57) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో కైరవ్‌ శర్మ (3/51) మెరిశాడు. ఛేదనలో కెనడా 48.1 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది. జోషువా (4/44), జాకబ్‌ (3/45)తో పాటు టామ్‌ (3/38) కూడా బంతితో సత్తాచాటారు. మరోవైపు దక్షిణాఫ్రికా టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (104) పోరాటంతో ఆ జట్టు గ్రూప్‌- బి మ్యాచ్‌లో 121 పరుగుల తేడాతో ఉగాండాపై గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 231 పరుగులు చేసింది. బ్రెవిస్‌ అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. అనంతరం ఉగాండా 33.4 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. గ్రూప్‌- సిలో పపువా న్యూ గునియాపై 135 పరుగుల తేడాతో నెగ్గిన అఫ్గానిస్థాన్‌ టోర్నీలో శుభారంభం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని