Published : 21 Jan 2022 01:43 IST

రోడ్డు భద్రత సిరీస్‌కు సచిన్‌ దూరం

దిల్లీ: అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు బరిలో దిగే రోడ్డు భద్రత ప్రపంచ సిరీస్‌ టోర్నీ రెండో సీజన్‌కు దిగ్గజ ఆటగాడు సచిన్‌ తెందుల్కర్‌ దూరంగా ఉండనున్నాడు. సచిన్‌తో సహా తొలి సీజన్‌లో పాల్గొన్న చాలామంది ఆటగాళ్లకు బకాయిలు పెండింగులో ఉండటమే ఇందుకు కారణం. తొలి సీజన్‌కు సచిన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా, సనీల్‌ గావస్కర్‌ టోర్నీ కమిషనర్‌గా వ్యవహరించారు. ‘‘రోడ్డు భద్రత సిరీస్‌ రెండో సీజన్‌లో సచిన్‌ ఆడట్లేదు. మార్చి 1 నుంచి 19 వరకు యూఏఈలో టోర్నీ జరుగనుంది. సచిన్‌ ఏ రకంగానూ టోర్నీలో భాగం కావడం లేదు. సచిన్‌తో సహా చాలామందికి నిర్వాహకులు బకాయిలు చెల్లించలేదు’’ అని సచిన్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని