అగ్రస్థానం కోల్పోయిన టీమ్‌ఇండియా

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో పరాజయం పాలైన టీమ్‌ఇండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. తాజాగా ప్రకటించిన టెస్టు జట్టు జాబితాలో రెండు స్థానాలు దిగజారిన భారత్‌..

Published : 21 Jan 2022 01:43 IST

దుబాయ్‌: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో పరాజయం పాలైన టీమ్‌ఇండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. తాజాగా ప్రకటించిన టెస్టు జట్టు జాబితాలో రెండు స్థానాలు దిగజారిన భారత్‌.. 116 పాయింట్లతో మూడో ర్యాంకులో నిలిచింది. సఫారీ పర్యటనలో తొలి టెస్టులో గెలిచి చారిత్రక సిరీస్‌ విజయం సాధించేలా కనిపించిన జట్టు.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి 1-2తో సిరీస్‌ కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ తర్వాత కోహ్లి టెస్టు కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పాడు. మరోవైపు యాషెస్‌ సిరీస్‌లో 4-0తో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించిన ఆస్ట్రేలియా నంబర్‌వన్‌ ర్యాంకు అందుకుంది. 119 పాయింట్లతో ఆ జట్టు అగ్రస్థానాన్ని చేరుకుంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను 1-1తో సమం చేసుకున్న న్యూజిలాండ్‌ 117 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్‌ నాలుగో స్థానంలో ఉంది. భారత్‌పై సిరీస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా ఓ స్థానం మెరుగై అయిదో ర్యాంకు దక్కించుకుంది. పాకిస్థాన్‌ ఓ స్థానం దిగజారి ఆరో ర్యాంకులో నిలిచింది. శ్రీలంక (7), వెస్టిండీస్‌ (8), బంగ్లాదేశ్‌ (9), జింబాబ్వే (10) స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు