‘టాప్స్‌’ నుంచి దీపిక, అతాను తొలగింపు

టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం పథకం (టాప్స్‌) నుంచి భారత స్టార్‌ ఆర్చర్లు దీపిక కుమారి, అతాను దాస్‌లను తప్పించారు. హైదరాబాద్‌లో జరిగిన జాతీయ ర్యాంకింగ్‌ టోర్నీలో ఆకట్టుకోలేకపోయిన ...

Published : 21 Jan 2022 01:43 IST

దిల్లీ: టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం పథకం (టాప్స్‌) నుంచి భారత స్టార్‌ ఆర్చర్లు దీపిక కుమారి, అతాను దాస్‌లను తప్పించారు. హైదరాబాద్‌లో జరిగిన జాతీయ ర్యాంకింగ్‌ టోర్నీలో ఆకట్టుకోలేకపోయిన భార్యభర్తల జోడీని ‘టాప్స్‌’ నుంచి తొలగించారు. ఈ టోర్నీలో దీపిక, అతానుల వైఫల్యం నేపథ్యంలో మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌ (ఎంఓసీ) వీరిద్దరికి అందిస్తున్న సహకారాన్ని సమీక్షించింది. ‘‘ర్యాంకింగ్‌ టోర్నీలో తక్కువ ప్రదర్శన కారణంగా టాప్స్‌ జాబితాలో వీరిద్దరిని చేర్చకూడదని ఎంఓసీ నిర్ణయించింది’’ అని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని