
కోహ్లి నిర్ణయం ఆశ్చర్యం కలిగించలేదు
మస్కట్: టీమ్ఇండియా టెస్టు జట్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లి వీడ్కోలు పలకడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. కఠినమైన బయో బబుల్ జీవితం అతని నిర్ణయానికి ఓ కారణం అయ్యుండొచ్చని తెలిపాడు. ‘‘ఆధునిక తరం క్రీడాకారుల్ని విమర్శించే వాళ్లు మూర్ఖులు. వారి పట్ల కఠినంగా వ్యవహరించడం.. విమర్శించడం అన్యాయం. బుడగలో ఆడటం చాలా కష్టం. కోహ్లి ఆటను మీరు సరిగ్గా గమనించలేదు. అతనికి ప్రేక్షకులు కావాలి. వారితో కలిసి కోహ్లి సాగిపోతాడు. అభిమానుల్ని అలరిస్తాడు. సారథ్యం అన్నిటికంటే గొప్ప బాధ్యత. కాని బుడగ వాతావరణంలో వినోదం ఉండదు కాబట్టి గొప్పగా అనిపించదు. కోహ్లి కెప్టెన్సీ వదులుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. అదనపు ఒత్తిడి నుంచి కాస్త విరామం తీసుకోవాలని అతను భావించాడు. బుడగలో ఆడటం చాలా కష్టమైన పని. రోహిత్ అద్భుతమైన ఆటగాడు. టీమ్ఇండియా టెస్టు కెప్టెన్సీకి అతను సరైనోడు. రిషబ్ పంత్ ఇప్పుడే కాదు. అతనికంటూ ఒకరోజు వస్తుంది’’ అని పీటర్సన్ అన్నాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.