అమ్మాయిలకు చావోరేవో!

ఫిఫా ప్రపంచకప్‌ ప్లేఆఫ్స్‌ స్థానంపై కన్నేసిన భారత అమ్మాయిల ఫుట్‌బాల్‌ జట్టు చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఆసియా మహిళల ఫుట్‌బాల్‌ కప్‌లో కనీసం క్వార్టర్స్‌ చేరితేనే భారత జట్టుకు ప్రపంచకప్‌ అవకాశాలు

Published : 23 Jan 2022 01:46 IST

నేడు చైనీస్‌ తైపీతో మ్యాచ్‌
ఆసియా మహిళల ఫుట్‌బాల్‌ కప్‌

ముంబయి: ఫిఫా ప్రపంచకప్‌ ప్లేఆఫ్స్‌ స్థానంపై కన్నేసిన భారత అమ్మాయిల ఫుట్‌బాల్‌ జట్టు చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఆసియా మహిళల ఫుట్‌బాల్‌ కప్‌లో కనీసం క్వార్టర్స్‌ చేరితేనే భారత జట్టుకు ప్రపంచకప్‌ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఈ నేపథ్యంలో గ్రూప్‌- ఎలో తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో మన జట్టు ఆదివారం చైనీస్‌ తైపీతో పోటీపడుతుంది. తమ తొలి మ్యాచ్‌లో ఇరాన్‌తో మ్యాచ్‌ను 0-0తో డ్రా చేసుకున్న భారత్‌.. చైనీస్‌ తైపీతో పోరులో విజయమే లక్ష్యంగా బరిలో  దిగుతుంది. మరోవైపు ఎనిమిది సార్లు ఛాంపియన్‌ చైనా చేతిలో చిత్తుగా ఓడిన చైనీస్‌ తైపీ పుంజుకోవాలని చూస్తోంది. గ్రూపులో తమ చివరి మ్యాచ్‌లో భారత్‌.. చైనాతో తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చైనీస్‌ తైపీపై గెలిస్తేనే జట్టుకు క్వార్టర్స్‌ చేరే అవకాశాలుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని