
కార్ల్సన్ చేతిలో ప్రజ్ఞానంద ఓటమి
విజ్క్ ఆన్జీ (నెదర్లండ్స్): టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ ఏడో రౌండ్లో ప్రజ్ఞానంద.. ప్రపంచ నంబర్‌వన్ కార్ల్స్న్ చేతిలో ఓడిపోయాడు. కార్ల్సన్ 34 ఎత్తుల్లో గెలిచాడు. అతడు అయిదు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. మరో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతి.. జోర్గెన్ దీన్ ఫారీస్ట్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ టోర్నీలో విదిత్‌కు ఇదే తొలి ఓటమి. దీంతో అతడు అగ్ర స్థానం నుంచి మూడో ర్యాంకుకు పడిపోయాడు. దీంతో పాటుగా జరుగుతున్న ఛాలెంజర్స్ ఈవెంట్లో తెలుగు కుర్రాడు అర్జున్ ఎరిగైసి.. ఏడో రౌండ్లో రినత్ జుమాబయేవ్ (కజకిస్థాన్)తో పాయింట్లు పంచుకున్నాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.