తాహిర్‌.. 19 బంతుల్లో 52

స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ (52 నాటౌట్‌; 19 బంతుల్లో 3×4, 5×6) బ్యాటుతో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో లెజెండ్స్‌ లీగ్‌ టీ20 క్రికెట్‌ టోర్నీలో ఇండియా మహరాజాస్‌పై వరల్డ్‌ జెయింట్స్‌ పైచేయి సాధించింది.

Published : 24 Jan 2022 04:27 IST

ఇండియా మహరాజాస్‌పై వరల్డ్‌ జెయింట్స్‌ గెలుపు

మస్కట్‌: స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ (52 నాటౌట్‌; 19 బంతుల్లో 3×4, 5×6) బ్యాటుతో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో లెజెండ్స్‌ లీగ్‌ టీ20 క్రికెట్‌ టోర్నీలో ఇండియా మహరాజాస్‌పై వరల్డ్‌ జెయింట్స్‌ పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో జెయింట్స్‌ మూడు వికెట్ల తేడాతో మహరాజాస్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన మహరాజాస్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ నమన్‌ ఓజా (140; 69 బంతుల్లో 15×4, 9×6) విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించాడు. ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. కెప్టెన్‌ మహ్మద్‌ కైఫ్‌ (53 నాటౌట్‌; 47 బంతుల్లో 1×4, 3×6) అర్ధ సెంచరీ సాధించాడు. నమన్‌, కైఫ్‌ మూడో వికెట్‌కు 187 పరుగులు జోడించారు. అనంతరం జెయింట్స్‌ మరో మూడు బంతులు మిగిలివుండగానే 7 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. కెవిన్‌ పీటర్సన్‌ (53; 27 బంతుల్లో 2×4, 6×6), డారెన్‌ సామి (28; 11 బంతుల్లో 1×4, 3×6) రాణించినా.. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఓటమి బాటలో పయనించింది. కానీ చివర్లో తాహిర్‌ అనూహ్యంగా చెలరేగిపోయాడు. 38 బంతుల్లో 70 పరుగులు కావాల్సిన సమయంలో క్రీజులో అడుగుపెట్టిన తాహిర్‌.. భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు