
Published : 25 Jan 2022 02:00 IST
కరోనాతో అమ్మాయిలు ఔట్
ముంబయి: కరోనా కారణంగా మహిళల ఫుట్‌బాల్ ఆసియాకప్‌లో భారత్ కథ ముగిసింది. భారత జట్టు మ్యాచ్‌లన్నీ రద్దు చేస్తున్నట్లు ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) సోమవారం లాంఛనంగా ప్రకటించింది. తమ జట్టులో 12 మందికి కరోనా సోకడంతో ఆదివారం చైనీస్ తైపీతో మ్యాచ్‌లో భారత్.. జట్టును బరిలోకి దించలేకపోయింది. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. భారత్ టోర్నీ నుంచి ఉపసంహరించుకున్నట్లుగా పరిగణించామని ఏఎఫ్సీ తెలిపింది. టోర్నీలో భారత్ మ్యాచ్‌లన్నింటినీ రద్దు చేసినట్లు, చెల్లనివిగా పరిగణించినట్లు చెప్పింది.
Tags :