
Published : 25 Jan 2022 02:01 IST
సెమీస్‌లో భారత్
మస్కట్: వరుసగా రెండో విజయం సాధించిన భారత్.. మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గుర్జీత్ కౌర్ హ్యాట్రిక్ (8వ, 37వ, 48వ) గోల్స్ కొట్టడంతో సోమవారం 9-1తో సింగపూర్‌ను చిత్తు చేసింది. మోనిక (6వ, 17వ), జ్యోతి (43వ, 58వ) చెరో రెండు గోల్స్ సాధించారు. వందన (8వ), మరియానా కుజుర్ (10వ) ఒక్కో గోల్ కొట్టారు. భారత్ బుధవారం జరిగే సెమీస్‌లో కొరియాతో తలపడుతుంది.
Tags :