ఫైనల్‌ బెర్తుపై భారత్‌ గురి

ఆసియా కప్‌ హాకీ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ ఫైనల్‌ బెర్తుపై గురిపెట్టింది. బుధవారం జరిగే సెమీఫైనల్లో కొరియాను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లాలని భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో 9-0తో మలేసియాపై గెలిచి టోర్నీని ఘనంగా మొదలుపెట్టిన టాప్‌సీడ్‌ భారత్‌.

Published : 26 Jan 2022 03:15 IST

కొరియాతో సెమీస్‌ పోరు నేడు
మహిళల ఆసియా కప్‌ హాకీ

మస్కట్‌: మహిళల ఆసియా కప్‌ హాకీ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ ఫైనల్‌ బెర్తుపై గురిపెట్టింది. బుధవారం జరిగే సెమీఫైనల్లో కొరియాను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లాలని భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో 9-0తో మలేసియాపై గెలిచి టోర్నీని ఘనంగా మొదలుపెట్టిన టాప్‌సీడ్‌ భారత్‌.. రెండో పోరులో 0-2తో జపాన్‌ చేతిలో ఓడింది. మూడో మ్యాచ్‌లో 9-1తో సింగపూర్‌పై విజయంతో పుంజుకున్న భారత్‌ ఆత్మవిశ్వాసంతో సెమీస్‌ చేరుకుంది. సవిత పూనియా సారథ్యంలోని జట్టు సెమీస్‌లో నూటికి నూరు శాతం ప్రదర్శన కనబరచాలని అనుకుంటోంది. ఇప్పటి వరకు బాగానే ఆకట్టుకున్న భారత జట్టు ఎక్కువగా ఫీల్డ్‌ గోల్స్‌ సాధించింది. పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలచడంలో విఫలమైంది. సింగపూర్‌తో మ్యాచ్‌లో డ్రాగ్‌ఫ్లికర్‌ గుర్జిత్‌కౌర్‌ ‘హ్యాట్రిక్‌’ సాధించినా పెనాల్టీ కార్నర్‌ల విషయంలో భారత్‌ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. 15 పెనాల్టీ కార్నర్‌ అవకాశాలు లభించగా.. అందులో మూడింటిని మాత్రమే గోల్స్‌గా మలచడం ఆందోళన కలిగించేదే. అయితే పార్వర్డ్‌లతో పాటు డిఫెండర్లు కూడా సత్తాచాటితే భారత్‌కు తిరుగుండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని