Published : 26 Jan 2022 03:30 IST

ప్రపంచకప్‌ గెలిస్తేనే గొప్పా?

ఎంత బాగా ఆడారన్నదే ముఖ్యం
కోహ్లి నిర్ణయాన్ని గౌరవించాలి

మస్కట్‌: జట్టుకు ప్రపంచకప్‌ అందించనంత మాత్రాన విరాట్‌ కోహ్లి గొప్ప కెప్టెన్‌ కాకుండా పోడని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. కోహ్లి కెప్టెన్‌గా ఉండగా భారత జట్టు వివిధ ఫార్మాట్లలో గొప్ప   విజయాలందుకున్నప్పటికీ.. ఐసీసీ ట్రోఫీ మాత్రం గెలవని సంగతి తెలిసిందే. ఇటీవల అనూహ్య పరిణామాల మధ్య విరాట్‌ మూడు ఫార్మాట్ల నుంచి కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై రవిశాస్త్రి మాట్లాడాడు. ‘‘టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్న కోహ్లి నిర్ణయాన్ని మనం గౌరవించాలి. అది అతడిష్టం. ప్రతిదానికీ ఒక సమయం వస్తుంది. గతంలో చాలామంది ప్రముఖ ఆటగాళ్లు తమ ఆట మీద దృష్టి పెట్టడం కోసం కెప్టెన్సీని వదులుకున్నారు. చాలామంది గొప్ప ఆటగాళ్లు ప్రపంచకప్‌ గెలవలేకపోయారు. మనకు ప్రపంచకప్‌ గెలిచిన కెప్టెన్లు ఎంతమంది ఉన్నారసలు? సచిన్‌ చివరగా ప్రపంచకప్‌ అందుకునే సమయానికి ఆరుసార్లు ఆ టోర్నీలో ఆడాడు. అంతిమంగా మన ఆట ఎలా ఉందన్నదే ముఖ్యం. అంకిత భావంతో ఆడారా.. సుదీర్ఘ కాలం ఆడారా.. ఆటకు పేరు తీసుకురాగలిగారా.. ఇలాంటి అంశాల ఆధారంగా ఆటగాడి స్థాయిని అంచనా వేయాలి’’ అని రవిశాస్త్రి అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు టెస్టు, వన్డే సిరీస్‌లు ఓడిపోవడంపై రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘‘ఒక సిరీస్‌ ఓడగానే జనాలు విమర్శించడం మొదలుపెడతారు. కానీ ప్రతి మ్యాచ్‌ గెలవాలంటే సాధ్యం కాదు. విజయాలుంటాయి. అలాగే ఓటములుంటాయి. కాబట్టి ఆందోళన అనవసరం. జట్టు ఉన్నట్లుండి ప్రమాణాలు పడిపోవు. అది కూడా అయిదేళ్ల పాటు నంబర్‌వన్‌గా ఉన్న జట్టులో’’ అన్నాడు. కెప్టెన్‌గా తప్పుకున్నాక కోహ్లి వ్యవహార శైలి మారిందన్న అభిప్రాయాలపై రవి మాట్లాడుతూ.. ‘‘దక్షిణాఫ్రికా సిరీస్‌లో నేను ఒక్క బంతి కూడా చూడలేదు. కాబట్టి ఆ విషయం చెప్పలేను. అయితే కోహ్లి తీరులో పెద్ద మార్పయితే వచ్చి ఉండదు’’ అన్నాడు. కోహ్లీకి, బీసీసీఐ పెద్దలకు పడట్లేదన్న ఊహాగానాలపై రవిశాస్త్రిని అడిగితే.. ‘‘ఆటగాళ్లు, బీసీసీఐ మధ్య సమాచార మార్పిడి సరిగ్గా ఉండాలి. నేను ఇప్పుడు వారి మధ్య దూరాలనుకోవడం లేదు. అక్కడేం జరిగిందో నాకు తెలియదు. ఇరువురితో మాట్లాడితే కానీ దీనిపై స్పందించలేను. మన దగ్గర పెద్దగా సమాచారం లేనపుడు మౌనంగా ఉండటం మంచిది. ఏడేళ్ల తర్వాత ఆట నుంచి నేను విరామం తీసుకున్నా. ఇప్పుడొచ్చి జనాల్లోకి వచ్చి మురికి శుభ్రం చేసుకోవాలని చూడను. నా పని ముగిసిన రోజు నేను మౌనంగా ఉంటాను. అంతే తప్ప బహిరంగ వేదికల్లో నా ఆటగాళ్ల గురించి మాట్లాడను’’ అని తేల్చేశాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని