Sreesanth: ఐపీఎల్‌ వేలంలో కనిపించనున్న మాజీ పేసర్‌శ్రీశాంత్‌

టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ శ్రీశాంత్‌.. ఐపీఎల్‌ ఆటగాళ్ల మెగా వేలంలో కనిపించనున్నాడు. వచ్చేనెలలో జరిగే వేలం కోసం 38 ఏళ్ల శ్రీశాంత్‌ తన పేరును నమోదు చేసుకున్నాడు.

Updated : 26 Jan 2022 07:02 IST

దిల్లీ: టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ శ్రీశాంత్‌.. ఐపీఎల్‌ ఆటగాళ్ల మెగా వేలంలో కనిపించనున్నాడు. వచ్చేనెలలో జరిగే వేలం కోసం 38 ఏళ్ల శ్రీశాంత్‌ తన పేరును నమోదు చేసుకున్నాడు. తన కనీస ధరను రూ.50 లక్షలుగా నిర్ణయించాడు. 2021 ఆటగాళ్ల వేలానికి తన కనీస ధరను రూ.75 లక్షలుగా నిర్ణయించిన శ్రీశాంత్‌ను  ఏ ఫ్రాంచైజీ కొనుక్కోలేదు. 2013 ఐపీఎల్‌లో చివరి సారిగా ఆడిన అతడిపైౖ స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల    కారణంగా వేటు పడింది. శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవిత కాల నిషేధం విధించింది. నిషేధాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన అతడికి 2019లో ఊరట లభించింది. శిక్ష కాలాన్ని పునఃపరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించడంతో బీసీసీఐ అతనిపై నిషేధాన్ని ఏడేళ్లకు కుదించింది. దీంతో 2020 సెప్టెంబరులో శ్రీశాంత్‌పై నిషేధం తొలగిపోయింది. 2021లో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ, విజయ్‌ హజారే ట్రోఫీలలో కేరళ తరఫున అతడు బరిలో దిగాడు.  విజయ్‌ హజారేలో 6 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని