
ఫైనలిస్టులకు సమంగా ప్రైజ్‌మనీ
దిల్లీ: సయ్యద్ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ రద్దయిన నేపథ్యంలో ప్రైజ్‌మనీని ఇద్దరు ఆటగాళ్లకు సమంగా పంచనున్నారు. ఫైనల్ చేరిన ఆర్నాడ్ మెర్కెల్, లూకాస్ క్లేర్‌బౌట్ (ఫ్రాన్స్)లలో ఒకరు పాజిటివ్‌గా తేలడంతో మ్యాచ్‌ను నిర్వహించలేదు. ‘‘సయ్యద్ మోదీ టోర్నీలో ఫైనల్ చేరిన ఇద్దరు ఆటగాళ్లు ప్రైజ్‌మనీని సమంగా పంచుకుంటారు. ఫైనలిస్టులలో ఒకరు పాజిటివ్‌గా తేలడం.. అతనితో మరో ఆటగాడు సన్నిహితంగా ఉండటంతో మ్యాచ్ సాధ్యంకాలేదు’’ అని బీడబ్ల్యూఎఫ్ పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.