నంబర్‌వన్‌గా షెఫాలీ

భారత యువ బ్యాటర్‌ షెఫాలీవర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మంగళవారం ప్రకటించిన మహిళల టీ20 బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపరుచుకున్న షెఫాలీ (726 పాయింట్లు) నంబర్‌వన్‌

Published : 26 Jan 2022 03:37 IST

దుబాయ్‌: భారత యువ బ్యాటర్‌ షెఫాలీవర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మంగళవారం ప్రకటించిన మహిళల టీ20 బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపరుచుకున్న షెఫాలీ (726 పాయింట్లు) నంబర్‌వన్‌ ర్యాంకు సొంతం చేసుకుంది. స్మృతి మంధాన (709) నాలుగో స్థానంలో నిలిచింది. బౌలింగ్‌ జాబితాలో దీప్తిశర్మ (685) నాలుగో ర్యాంకు సాధించింది. ఆల్‌రౌండర్లలో దీప్తిశర్మ (315) మూడో స్థానంలో నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని