పాక్‌లో ఆసీస్‌ పర్యటన

పాకిస్థాన్‌లో ఆస్ట్రేలియా జట్టు పర్యటనకు రంగం సిద్ధమవుతుంది. ఆటగాళ్ల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో పూర్తిస్థాయి ఆసీస్‌ జట్టు పాక్‌లో పర్యటించనుంది. భారత్‌, శ్రీలంకతో కలిసి పాకిస్థాన్‌ 1996 వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చింది.

Published : 26 Jan 2022 03:37 IST

మెల్‌బోర్న్‌: పాకిస్థాన్‌లో ఆస్ట్రేలియా జట్టు పర్యటనకు రంగం సిద్ధమవుతుంది. ఆటగాళ్ల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో పూర్తిస్థాయి ఆసీస్‌ జట్టు పాక్‌లో పర్యటించనుంది. భారత్‌, శ్రీలంకతో కలిసి పాకిస్థాన్‌ 1996 వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చింది. పాక్‌లో జరిగిన చివరి ఐసీసీ టోర్నీ అదే. 2009లో శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో అంతర్జాతీయ క్రికెట్‌ ఆతిథ్యానికి పాక్‌ దూరమైంది. నిరుడు టీ20 ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌ చివరి నిమిషంలో తప్పుకోగా.. భద్రత కారణాలతో పాక్‌ పర్యటనకు ఇంగ్లాండ్‌ దూరంగా ఉంది. అయితే 24 ఏళ్ల తర్వాత మళ్లీ పాక్‌లో పర్యటించేందుకు ఆసీస్‌ సన్నాహాలు చేసుకుంటుంది. ‘‘పర్యటనకు సంబంధించి కొన్ని విషయాలపై రెండు బోర్డులు చర్చిస్తున్నాయి. పర్యటనకు ఆమోదం లభించగానే జట్టును ప్రకటిస్తాం. చర్చలు సరైన దిశలో సాగుతున్నాయి.’’ అని ఆస్ట్రేలియా సెలెక్టర్‌ జార్జ్‌ బెయిలీ తెలిపాడు. మార్క్‌ టేలర్‌ సారథ్యంలో ఆసీస్‌ 1998లో చివరి సారిగా పాక్‌లో పర్యటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని