ఐపీఎల్‌పై మెక్‌డెర్మాట్‌, షెఫర్డ్‌ కన్ను

ఆస్ట్రేలియా ఓపెనర్‌ బెన్‌ మెక్‌డెర్మాట్‌, వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ రొమారియో షెఫర్డ్‌ ఐపీఎల్‌పై కన్నేశారు. వచ్చేనెలలో జరుగనున్న ఆటగాళ్ల మెగా వేలంపాటలో భారీమొత్తం దక్కించుకుని   ఐపీఎల్‌లో అరంగేట్రం చేయాలని భావిస్తున్నారు. బిగ్‌బాష్‌ లీగ్‌  (బీబీఎల్‌)లో ఈ సీజన్లో అత్యధికంగా 577 పరుగులు

Published : 26 Jan 2022 03:37 IST

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఓపెనర్‌ బెన్‌ మెక్‌డెర్మాట్‌, వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ రొమారియో షెఫర్డ్‌ ఐపీఎల్‌పై కన్నేశారు. వచ్చేనెలలో జరుగనున్న ఆటగాళ్ల మెగా వేలంపాటలో భారీమొత్తం దక్కించుకుని   ఐపీఎల్‌లో అరంగేట్రం చేయాలని భావిస్తున్నారు. బిగ్‌బాష్‌ లీగ్‌  (బీబీఎల్‌)లో ఈ సీజన్లో అత్యధికంగా 577 పరుగులు రాబట్టిన మెక్‌డెర్మాట్‌ ఆస్ట్రేలియా టీ20 జట్టులోకి పునరాగమనం చేశాడు. శ్రీలంకతో సిరీస్‌ కోసం అతనికి జట్టులో చోటు కల్పించారు. నిరుడు   బీబీఎల్‌లో సత్తాచాటిన మెరెడిత్‌ (రూ.8 కోట్లు), రిచర్డ్‌సన్‌ (రూ.14 కోట్లు)లను పంజాబ్‌ కింగ్స్‌ భారీ మొత్తాలకు కొనుగోలు చేయడంతో తనకు కూడా మంచి ధర పలుకుతుందని మెక్‌డెర్మాట్‌ భావిస్తున్నాడు. ఇక ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో 28 బంతుల్లో 44 పరుగులు సాధించిన షెఫర్డ్‌ ఐపీఎల్‌పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు. విండీస్‌ నుంచి 41 మంది ఆటగాళ్లు వేలంపాట బరిలో ఉండగా.. వారిలో షెఫర్డ్‌ కూడా ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని