
సెమీస్లో భారత మహిళల ఓటమి
మస్కట్: మహిళల ఆసియాకప్ హాకీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ కథ ముగిసింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 2-3తో కొరియా చేతిలో ఓడిపోయింది. కొరియా తరఫున కెప్టెన్ ఎనుబి చియాన్ (31వ), స్యూంగ్ జు లీ (45వ), హీజిన్ చో (47వ) గోల్స్ కొట్టారు. భారత జట్టులో వందన కటారియా (28వ), లాల్రెమ్సియామి (54వ) చెరో గోల్ సాధించారు. భారత్ ఇక మూడో స్థానం కోసం.. జపాన్, చైనా మధ్య సెమీఫైనల్లో ఓడిన జట్టుతో తలపడుతుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.