
సంతోష్ ట్రోఫీ వాయిదా
దిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సంతోష్ ట్రోఫీ జాతీయ ఫుట్‌బాల్ టోర్నీని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) వాయిదా వేసింది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 6 వరకు కేరళలోని మలప్పురంలో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. కరోనా తీవ్రత కారణంగా టోర్నీని వాయిదా వేస్తున్నట్లు ఏఐఎఫ్ఎఫ్ తెలిపింది. ‘‘కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం.. కేరళ ప్రభుత్వంతో చర్చల అనంతరం సంతోష్ ట్రోఫీని వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర సంఘాలకు తెలియజేశాం. ఫిబ్రవరి మూడో వారంలో పరిస్థితిని సమీక్షించి కొత్త షెడ్యూల్‌పై నిర్ణయం తీసుకుంటాం’’ అని ఏఐఎఫ్ఎఫ్ పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.