Published : 27 Jan 2022 03:41 IST

నాకు పద్మభూషణ్‌ సమాజానికే గౌరవం

దిల్లీ: తనకు పద్మభూషణ్‌ పురస్కారం లభించడం దివ్యాంగులకు గొప్ప గౌరవమని పారా అథ్లెట్‌ దేవేంద్ర జజారియా అభివర్ణించాడు. దివ్యాంగుల పట్ల సమాజం దృక్పథం మారడానికి, వాళ్లు మరింత సత్తాచాటడానికి ఈ పురస్కారం దోహద పడుతుందని తెలిపాడు. 2004, 2016 పారా ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు సాధించిన జజారియా.. 2020 టోక్యో క్రీడల్లో రజత పతకం నెగ్గాడు. దేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్‌ మంగళవారం జజారియాను వరించింది. ‘‘పారా క్రీడలకే కాదు యావత్‌ దివ్యాంగుల సమాజానికి గొప్ప గౌరవమిది. పారా క్రీడాకారుల పట్ల సమాజం దృక్పథం మారింది. ప్రజలు వారి పట్ల సంతోషంగా ఉన్నారు. మొదటిసారిగా ఒక పారా అథ్లెట్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. పారా అథ్లెట్ల విషయంలో ఆయనకు ముందుచూపు ఉంది. వారి అవసరాలు తీరుస్తున్నారు. యావత్‌ దివ్యాంగుల సమాజం తరఫున ఆయనకు కృతజ్ఞతలు’’ అని జజారియా తెలిపాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని