ప్రపంచకప్‌ షూటింగ్‌కు ఇషా

ఇటలీలోని కైరోలో ఫిబ్రవరి 26న ఆరంభమయ్యే ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌కు హైదరాబాదీ యువ షూటర్‌ ఇషా సింగ్‌ ఎంపికైంది. ఈ టోర్నీలో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌, 15 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌ విభాగాల్లో

Published : 28 Jan 2022 02:39 IST

దిల్లీ: ఇటలీలోని కైరోలో ఫిబ్రవరి 26న ఆరంభమయ్యే ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌కు హైదరాబాదీ యువ షూటర్‌ ఇషా సింగ్‌ ఎంపికైంది. ఈ టోర్నీలో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌, 15 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌ విభాగాల్లో ఇషా పోటీపడనుంది. 25 మీటర్ల మిక్స్‌డ్‌, 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగాల్లోనూ ఆమె బరిలో ఉంది. అయితే సెలక్షన్‌ ప్రమాణాలను అందుకోలేకపోయిన కారణంగా టాప్‌ షూటర్లు మను బాకర్‌, అపూర్వి చందెలా, అంజుం మౌద్గిల్‌ తదితరులు ఈ టోర్నీకి దూరమయ్యారు. ‘‘భారత్‌లో కరోనా పరిస్థితుల దృష్ట్యా జనవరిలో  జరిగాల్సిన సెలక్షన్‌ ట్రయల్స్‌ వాయిదా పడ్డాయి. ప్రపంచకప్‌కు ఎంపిక చేయడానికి సెలక్షన్స్‌ నిర్వహించే సమయం లేదు. అందుకే తాజా జాతీయ షూటింగ్‌లో ప్రతి విభాగంలో క్వాలిఫికేషన్‌ స్కోరు, ఫైనల్‌ ర్యాంకు ఆధారంగా ప్రపంచకప్‌కు వెళ్లే షూటర్లను ఎంపిక చేశాం’’ అని జాతీయ రైఫిల్‌ సంఘం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని