సెమీస్‌లో ఇంగ్లాండ్‌

ఓపెనర్‌ జాకబ్‌ బెతెల్‌ (88; 42 బంతుల్లో 16×4, 2×6) చెలరేగడంతో అండర్‌-19 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి క్వార్టర్‌ఫైనల్లో ఇంగ్లాండ్‌ ఆరు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది.

Published : 28 Jan 2022 02:43 IST

నార్త్‌ సౌండ్‌: ఓపెనర్‌ జాకబ్‌ బెతెల్‌ (88; 42 బంతుల్లో 16×4, 2×6) చెలరేగడంతో అండర్‌-19 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి క్వార్టర్‌ఫైనల్లో ఇంగ్లాండ్‌ ఆరు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 43.4  ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. డివాల్డ్‌ బ్రెవిస్‌ (97; 88 బంతుల్లో 9×4, 4×6) రాణించాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో రెహాన్‌ అహ్మద్‌ (4/48), జాషువా బాయ్‌డెన్‌ (2/31), జేమ్స్‌ సేల్స్‌ (2/33) సత్తాచాటారు. అనంతరం ఇంగ్లాండ్‌ 31.2 ఓవర్లలోనే 4 వికెట్లకు 212 పరుగులు సాధించి  విజయాన్ని అందుకుంది. ఓపెనర్‌ జార్జ్‌ థామస్‌ (19)తో కలిసి బెతెల్‌ తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించి జట్టు గెలుపునకు బాటలు వేశాడు. శనివారం జరిగే క్వార్టర్స్‌ పోరులో బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని