పేసర్లకు విశ్రాంతి ఇవ్వొద్దు

ఫాస్ట్‌ బౌలర్లకు విశ్రాంతి ఇవ్వొద్దని ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ అన్నాడు. పేసర్ల పనిభారం నిర్వహణ పద్ధతికి తాను వ్యతిరేకమని తెలిపాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో టీమ్‌ఇండియా వన్డే సిరీస్‌కు పేసర్‌ మహ్మద్‌ షమికి

Published : 28 Jan 2022 02:44 IST

మస్కట్‌: ఫాస్ట్‌ బౌలర్లకు విశ్రాంతి ఇవ్వొద్దని ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ అన్నాడు. పేసర్ల పనిభారం నిర్వహణ పద్ధతికి తాను వ్యతిరేకమని తెలిపాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో టీమ్‌ఇండియా వన్డే సిరీస్‌కు పేసర్‌ మహ్మద్‌ షమికి సెలెక్షన్‌ కమిటీ విశ్రాంతినిచ్చింది. ఈ సిరీస్‌లో భారత్‌ 0-3తో ఓడిపోయింది. ‘‘విశ్రాంతి పద్ధతికి నేను వ్యతిరేకం. బౌలర్లకు విశ్రాంతి ఇవ్వడం నాకిష్టం ఉండదు. బౌలర్లు ప్రతి ఒక్క మ్యాచ్‌ ఆడటం నాకిష్టం. వాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతుంటే ఫర్వాలేదు. కాని ఎంతో కష్టపడే బౌలర్లు నిరంతరం ఆడుతూనే ఉండాలి’’ అని బ్రెట్‌ లీ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని