మన్‌ప్రీత్‌ సారథ్యంలో..

ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రొ లీగ్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్‌తో జరిగే మ్యాచ్‌ల్లో తలపడే భారత జట్టుకు స్టార్‌ మిడ్‌ఫీల్డర్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యం వహించనున్నాడు. ఫిబ్రవరి 8 నుంచి 13 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Published : 28 Jan 2022 02:46 IST

దిల్లీ: ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రొ లీగ్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్‌తో జరిగే మ్యాచ్‌ల్లో తలపడే భారత జట్టుకు స్టార్‌ మిడ్‌ఫీల్డర్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యం వహించనున్నాడు. ఫిబ్రవరి 8 నుంచి 13 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత జట్టుకు హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. యువ డ్రాగ్‌ఫ్లికర్‌ జుగ్‌రాజ్‌ సింగ్‌, స్ట్రయికర్‌ అభిషేక్‌ జట్టులో కొత్త ముఖాలు. స్టార్‌ గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేశ్‌, సురేందర్‌ కుమార్‌, నీలకంఠ శర్మ, లలిత్‌ కుమార్‌ తదితరులతో కూడిన 20 మంది సభ్యుల బలమైన భారత జట్టు ఈ మ్యాచ్‌ల్లో బరిలో దిగనుంది. వీరిలో 14 మంది టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన జట్టులో సభ్యులు. వచ్చే నెల 4న బెంగళూరు నుంచి దక్షిణాఫ్రికాకు బయల్దేరి వెళ్లనున్న మన్‌ప్రీత్‌ సేన.. ఫిబ్రవరి 8న ఫ్రాన్స్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఆ తర్వాత సఫారీ జట్టుతో 9న తలపడనుంది. మళ్లీ 12న ఫ్రాన్స్‌తో, 13న దక్షిణాఫ్రికాతో ఆడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని