క్వార్టర్స్‌లో సామియా, మాళవిక

ఒడిషా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో సామియా ఇమాద్‌ ఫారూఖీ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సామియా 21-11, 21-13తో అంజన కుమారిపై విజయం సాధించింది.

Published : 28 Jan 2022 02:47 IST

ఒడిషా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌

కటక్‌: ఒడిషా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో సామియా ఇమాద్‌ ఫారూఖీ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సామియా 21-11, 21-13తో అంజన కుమారిపై విజయం సాధించింది. ప్రపంచ జూనియర్‌ నంబర్‌వన్‌ తస్నిమ్‌ మీర్‌కు ప్రిక్వార్టర్స్‌లో చుక్కెదురైంది. మాళవిక బాన్సోద్‌ 21-13, 21-15తో తస్నిమ్‌ మీర్‌ను ఓడించింది. అస్మిత చాలిహ 21-17,   21-16తో అనుపమ ఉపాధ్యాయపై నెగ్గి క్వార్టర్స్‌ చేరుకుంది. పురుషుల సింగిల్స్‌లో తరుణ్‌ మన్నెపల్లి   21-18,    21-17తో మైస్నామ్‌ మీరాబాపై, మూడో సీడ్‌ శుభంకర్‌ డే 21-16, 21-14తో రాహుల్‌ యాదవ్‌పై, కిరణ్‌ జార్జ్‌ 21-12, 21-13తో చిరాగ్‌ సేన్‌పై నెగ్గారు. మరోవైపు అన్‌సీడెడ్‌ మిథున్‌ మంజునాథ్‌ సంచలన విజయం సాధించాడు. అతడు 21-11, 21-18తో ఏడో సీడ్‌ జూన్‌ వీ (మలేసియా)కి షాకిచ్చి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్‌లో ప్రియాంశుతో రజావత్‌తో మంజునాథ్‌ తలపడనున్నాడు. మరో ప్రిక్వార్టర్స్‌లో ప్రియాంషు 21-13, 21-12తో సతీశ్‌కుమార్‌పై విజయం సాధించాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ రావత్‌-శిఖా గౌతమ్‌ ఓడిపోయారు. రెండో రౌండ్లో ధ్రువ్‌-శిఖ   11-21, 14-21తో సచిన్‌ దియాస్‌-తిలని హెండవా (శ్రీలంక) చేతిలో ఓటమి చవిచూశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని