హాకీ దిగ్గజం చరణ్‌జిత్‌ కన్నుమూత

భారత జట్టు మాజీ కెప్టెన్‌, హాకీ దిగ్గజం చరణ్‌జిత్‌ సింగ్‌ కన్నుమూశారు. 1964 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టుకు సారథ్యం వహించిన చరణ్‌జిత్‌ గురువారం హిమాచల్‌ప్రదేశ్‌లోని తన స్వగృహంలో

Published : 28 Jan 2022 02:54 IST

దిల్లీ: భారత జట్టు మాజీ కెప్టెన్‌, హాకీ దిగ్గజం చరణ్‌జిత్‌ సింగ్‌ కన్నుమూశారు. 1964 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టుకు సారథ్యం వహించిన చరణ్‌జిత్‌ గురువారం హిమాచల్‌ప్రదేశ్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో మృతి చెందారు. 90 ఏళ్ల చరణ్‌జిత్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన భార్య 12 ఏళ్ల క్రితమే కన్నుమూశారు. ‘‘అయిదేళ్ల క్రితం స్ట్రోక్‌ రావడంతో నాన్న పక్షవాతానికి గురయ్యారు. అప్పట్నుంచి కర్ర సహాయంతో నడిచేవారు. గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. గురువారం ఉదయం నాన్న తుదిశ్వాస విడిచారు’’ అని చరణ్‌జిత్‌ చిన్న కుమారుడు వీపీ సింగ్‌ తెలిపారు. 1964 ఒలింపిక్‌ ఛాంపియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన మిడ్‌ ఫీల్డర్‌ చరణ్‌జిత్‌.. 1960 విశ్వ క్రీడల్లో రజతం గెలిచిన భారత జట్టులోనూ సభ్యుడిగా ఉన్నారు. 1962 ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించిన భారత జట్టుకు ఆయన ప్రాతినిధ్యం వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని