
తలైవాస్పైపట్నా పైచేయి
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-8లో పట్నా పైరేట్స్ ప్లేఆఫ్ రేసులో మరింత మెరుగైంది. గత మ్యాచ్‌లో ఓడిన ఈ జట్టు.. శుక్రవారం జరిగిన పోరులో 52-24తో తమిళ్ తలైవాస్‌పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆరంభంలో పట్నాకు తలైవాస్ గట్టిపోటీనే ఇచ్చింది. కానీ నెమ్మదిగా పట్నా పట్టు సాధించింది. 13వ నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన ఆ జట్టు విరామ సమయానికి 21-12 ఆధిక్యాన్ని సాధించింది. విరామం తర్వాత కూడా పట్నాదే జోరు. వరుసగా పాయింట్లు సాధించి అలవోకగా విజయాన్ని అందుకుంది. పట్నా జట్టులో మోను గోయత్ (9), సచిన్ (6) రైడింగ్‌లో రాణించారు. ఈ మ్యాచ్‌లో 28 పాయింట్ల తేడాతో నెగ్గిన పైరేట్స్ మొత్తం మీద 12 మ్యాచ్‌ల్లో 45 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.