భారత క్రికెట్‌కు రంజీ ట్రోఫీ వెన్నెముక

దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ భారత క్రికెట్‌కు వెన్నెముక అని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. రంజీ ట్రోఫీని విస్మరిస్తే భారత క్రికెట్‌ వెన్ను లేకుండా పోతుందని తెలిపాడు. ‘‘భారత క్రికెట్‌కు రంజీ ట్రోఫీ వెన్నెముక.

Published : 29 Jan 2022 02:09 IST

దిల్లీ: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ భారత క్రికెట్‌కు వెన్నెముక అని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. రంజీ ట్రోఫీని విస్మరిస్తే భారత క్రికెట్‌ వెన్ను లేకుండా పోతుందని తెలిపాడు. ‘‘భారత క్రికెట్‌కు రంజీ ట్రోఫీ వెన్నెముక. రంజీ ట్రోఫీని విస్మరించడం ప్రారంభించిన క్షణం నుంచి భారత క్రికెట్‌ వెన్ను లేకుండా తయారవుతుంది’’ అని రవిశాస్త్రి ట్వీట్‌ చేశాడు. కరోనా మహమ్మారి తీవ్రత పెరగడంతో ఈనెల 13న ప్రారంభంకావాల్సిన రంజీ ట్రోఫీని బీసీసీఐ వాయిదా వేసిన సంగతి తెలిసిందే.


రెండు దశల్లో..: రంజీ ట్రోఫీని ఈసారి రెండు దశల్లో నిర్వహించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు. ‘‘ఈ సీజన్‌లో రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. మొదటి దశలో లీగ్‌ మ్యాచ్‌ల్ని పూర్తిచేయనున్నాం. జూన్‌లో నాకౌట్‌ టోర్నీ జరుగుతుంది. రంజీ ట్రోఫీ అత్యంత ప్రతిష్టాత్మకమైన దేశవాళీ టోర్నీ. ప్రతి ఏడాది భారత క్రికెట్‌కు ఎంతోమంది ప్రతిభావంతుల్ని అందిస్తుంది. ఈ టోర్నీ ఉద్దేశాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం’’ అని జై షా తెలిపాడు. 38 జట్లు బరిలో దిగే రంజీ ట్రోఫీ ఫిబ్రవరి రెండో వారంలో మొదలయ్యే అవకాశముంది. నెల రోజుల్లో లీగ్‌ దశ పూర్తవుతుంది. మార్చి 27న ఐపీఎల్‌ను ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని