
మహిళల కప్పు ఎవరిదో?
మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫైనల్
బార్టీ X కొలిన్స్
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ పోరుకు రంగం సిద్ధమైంది. లోకల్ స్టార్ ఆష్లే బార్టీ, అమెరికా అమ్మాయి డానియెలీ రోజ్ కొలిన్స్ మధ్య శనివారం ఫైనల్ జరగబోతోంది. ఇద్దరూ ‘తొలి’ టైటిల్ కోసం తహతహలాడుతున్నవారే. బార్టీ ఇప్పటికే రెండు గ్రాండ్‌స్లామ్‌లు (2021 వింబుల్డన్, 2019 ఫ్రెంచ్ ఓపెన్) నెగ్గినా.. తన దేశంలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను మాత్రం నెగ్గలేదు. సొంతగడ్డపై విజేతగా నిలిచి కల నెరవేర్చుకోవడానికి ఇదే మంచి తరుణమని బార్టీ భావిస్తోంది. ఇక సంచలన ప్రదర్శనతో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన కొలిన్స్.. అదే ఊపులో టైటిల్ పట్టేయాలని చూస్తోంది. మరి ట్రోఫీ ఎవరిని వరిస్తుందో చూడాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.