U19WC: అండర్ 19 ప్రపంచకప్ మ్యాచ్లో భూకంపం.. వీడియో చూడండి..!

అండర్‌-19 ప్రపంచకప్‌ ప్లేట్‌ లీగ్‌లో భాగంగా ఐర్లాండ్‌, జింబాబ్వే మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. జింబాబ్వే ఆరో ఓవర్‌ నడుస్తుండగా ఉన్నట్లుండి మైదానంలోని కెమెరాలు వణికాయి. కామెంటరీ బాక్సు కుదుపులకు లోనైంది. ఆ ప్రభావం సుమారు ఓ 20 సెకన్ల వరకూ ఉంది.

Updated : 31 Jan 2022 10:17 IST

(Photo: Cricket World Cup Twitter)

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: అండర్‌-19 ప్రపంచకప్‌ ప్లేట్‌ లీగ్‌లో భాగంగా ఐర్లాండ్‌, జింబాబ్వే మధ్య తాజాగా మ్యాచ్‌ జరుగుతుండగా భూకంపం సంభవించింది. జింబాబ్వే ఆరో ఓవర్‌ నడుస్తుండగా ఉన్నట్లుండి మైదానంలోని కెమెరాలు వణికాయి. కామెంటరీ బాక్సు కుదుపులకు లోనైంది. ఆ ప్రభావం సుమారు 20 సెకన్ల వరకూ కనిపించింది. కానీ మ్యాచ్‌కు మాత్రం ఎలాంటి అంతరాయం కలగలేదు. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ సముద్ర తీరంలో ఏర్పడ్డ ఈ భూకంపం మ్యాచ్‌ జరుగుతున్న క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌లోనూ స్వల్ప ప్రకంపనలకు కారణమైంది. ‘‘భూకంపం వచ్చింది. మా వెనకాల రైలు వెళ్తున్న దానికంటే ఎక్కువ ప్రకంపనలే వచ్చాయి. మైదానంలోని మీడియా సెంటర్‌  వణికింది’’ అని ఆ సమయంలో కామెంటరీ బాక్సులో ఉన్న ఆండ్రూ పేర్కొన్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని