IPL 2022: శ్రేయస్‌ కోసం రూ.20 కోట్లు!

ఐపీఎల్‌ మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 12, 13 తేదీల్లో ఈ వేలం జరుగుతుంది. ఇప్పటికే వేలంలో పాల్గొనే 590 మంది ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఏ జట్టు ఏ ఆటగాడి కోసం ఎంత ధర వెచ్చిస్తుందోనన్న

Updated : 03 Feb 2022 06:49 IST

దిల్లీ: ఐపీఎల్‌ మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 12, 13 తేదీల్లో ఈ వేలం జరుగుతుంది. ఇప్పటికే వేలంలో పాల్గొనే 590 మంది ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఏ జట్టు ఏ ఆటగాడి కోసం ఎంత ధర వెచ్చిస్తుందోనన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా బాంబు పేల్చాడు. శ్రేయస్‌ అయ్యర్‌ కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ఏకంగా రూ.20 కోట్లు సిద్ధంగా పెట్టుకున్నట్లు తెలిసిందని అతను పేర్కొన్నాడు. ‘‘వేలం ఆసక్తికరంగా ఉండబోతోంది. శ్రేయస్‌ దాదాపు రూ.16 కోట్ల వరకూ అందుకునే అవకాశం ఉంది. అతని కోసం ఆర్సీబీ రూ.20 కోట్లు పెట్టేందుకు కూడా సిద్ధమైందని ఒకరు నాతో చెప్పారు. అది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే ఏ ఆటగాడికి కూడా అంత మొత్తం చెల్లించాలని నేను సూచించను. ఎవరూ అంత విలువ చేస్తారని అనుకోను. జట్టులో సమతూకం కోసం ఓ ఆటగాడిపై అంత ఖర్చు పెట్టొచ్చు’’ అని అతను తెలిపాడు. గత సీజన్‌ ముగిశాక ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లి తప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడా జట్టుకు ఓ సారథి కావాల్సి వచ్చింది. అందుకే గతంలో దిల్లీ క్యాపిటల్స్‌కు నాయకుడిగా మంచి ప్రదర్శన చేసిన శ్రేయస్‌పై ఆ జట్టు కన్నేసినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని