Virat Kohli: కొన్ని ఫ్రాంఛైజీలు నన్ను సంప్రదించాయి..: విరాట్‌ కోహ్లి

గతంలో కొన్ని ఫ్రాంఛైజీలు తనను వేలంలోకి రావాలని కోరినా తాను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతోనే ఉండాలని నిర్ణయించుకున్నానని టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ కోహ్లి చెప్పాడు. ‘‘నన్ను గతంలో కొన్ని ఫ్రాంఛైజీలు

Updated : 08 Feb 2022 07:53 IST

దిల్లీ: గతంలో కొన్ని ఫ్రాంఛైజీలు తనను వేలంలోకి రావాలని కోరినా తాను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతోనే ఉండాలని నిర్ణయించుకున్నానని టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ కోహ్లి చెప్పాడు. ‘‘నన్ను గతంలో కొన్ని ఫ్రాంఛైజీలు సంప్రదించాయి. వేలంలోకి రావాలని కోరాయి. నేనూ ఆలోచించా’’ అని తెలిపాడు. మరోవైపు ఐపీఎల్‌ కెప్టెన్‌గా ట్రోఫీ గెలవకపోవడంపై కోహ్లి స్పందిస్తూ.. ‘‘ఎందరో ఆటగాళ్లు ట్రోఫీలు గెలిచారు. కానీ ఎవరూ దాని ఆధారంగా అతడితో ఉండరు. మంచి వ్యక్తి అయితే ఇష్టపడతారు. చెడ్డ వ్యక్తి అయితే దూరంగా ఉంటారు. జీవితం అంటే అదే’’ అని చెప్పాడు.    ‘‘జనం ‘ఎట్టకేలకు నువ్వు ఫలానా జట్టుతో ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచావు’ అనడం కంటే.. ఆర్సీబీకి విధేయంగా ఉండడం నాకు గొప్పగా అనిపిస్తుంది’’ అని అన్నాడు. ఎనిమిదేళ్లు ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్న కోహ్లి ఇటీవలే ఆ బాధ్యతల నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని