Rishabh Pant: పంత్‌కు టెస్టు బ్యాటింగ్‌ అవార్డు

టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ క్రిక్‌ఇన్ఫో అవార్డు సొంతం చేసుకున్నాడు. నిరుడు జనవరిలో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఛేదనలో అజేయంగా 89 పరుగులు చేసి జట్టును గెలిపించిన అతను.. ‘టెస్టు బ్యాటింగ్‌ అవార్డు’కు

Updated : 11 Feb 2022 08:16 IST

దిల్లీ: టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ క్రిక్‌ఇన్ఫో అవార్డు సొంతం చేసుకున్నాడు. నిరుడు జనవరిలో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఛేదనలో అజేయంగా 89 పరుగులు చేసి జట్టును గెలిపించిన అతను.. ‘టెస్టు బ్యాటింగ్‌ అవార్డు’కు ఎంపికయ్యాడు. క్రిక్‌ఇన్ఫో 15వ వార్షిక అవార్డులను గురువారం ప్రకటించారు. 2020-21     ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌ 1-1తో సమమైన దశలో చివరి మ్యాచ్‌లో భారత్‌ వీరోచితంగా పోరాడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఛేదనలో పంత్‌ సంచలన ఇన్నింగ్స్‌తో విజయాన్ని అందుకున్న జట్టు.. 2-1తో సిరీస్‌ దక్కించుకుంది. మరోవైపు న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ గతేడాదికి గాను మేటి కెప్టెన్‌గా నిలిచాడు. జట్టును ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా, టీ20  ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిపినందుకు అతణ్ని ఈ అవార్డు వరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని