Harika Dronavalli: హారికకూ లైంగిక వేధింపుల లేఖ..

గత నవంబరులో రిగా (లాత్వియా)లో గ్రాండ్‌ స్విస్‌ టోర్నమెంట్‌ సందర్భంగా అనేక మంది ప్లేయర్లకు లైంగిక వేధింపుల లేఖలు వచ్చినట్లు వెల్లడైంది. భారత గ్రాండ్‌మాస్టర్‌ హారికకు కూడా ఈ లేఖ వచ్చింది. అయితే టోర్నమెంట్‌ చివరి రోజు వరకు తనకు ఈ విషయం తెలియదని, టోర్నీ నిర్వాహకులు

Updated : 13 Feb 2022 09:22 IST

చెన్నై: గత నవంబరులో రిగా (లాత్వియా)లో గ్రాండ్‌ స్విస్‌ టోర్నమెంట్‌ సందర్భంగా అనేక మంది ప్లేయర్లకు లైంగిక వేధింపుల లేఖలు వచ్చినట్లు వెల్లడైంది. భారత గ్రాండ్‌మాస్టర్‌ హారికకు కూడా ఈ లేఖ వచ్చింది. అయితే టోర్నమెంట్‌ చివరి రోజు వరకు తనకు ఈ విషయం తెలియదని, టోర్నీ నిర్వాహకులు ఈ విషయంలో సమర్థంగా వ్యవహరించారని హారిక చెప్పింది. ‘‘రిగాలో నా పేరిట లేఖ వచ్చింది. టోర్నీ చివరి రోజు వరకు నాకా విషయం తెలియదు. దాని వల్ల నాకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. చివరి రోజు వరకు లేఖల గురించి మాకు చెప్పలేదు. లేఖలను పోలీసులకు అప్పగించారు’’ అని తెలిపింది. ‘‘నేను ఆ లేఖను తెరవలేదు. ఎలాంటి ఇబ్బందినీ ఎదుర్కోలేదు. టోర్నీ నిర్వాహకులు, ఫిడే.. సమస్యను ఎదుర్కొనే విషయంలో సమర్థంగా వ్యవహరించారు’’ అని హారిక చెప్పింది. ‘‘లేఖలు వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాం. ఈ విషయాన్ని లాత్వియా పోలీసులు తీవ్రంగా తీసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు’’ అని అని ఫిడే తెలిపింది. మొత్తం 15 మంది క్రీడాకారులకు లేఖలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్లేయర్లకు పంపిన లేఖలో అశ్లీల మెటీరియల్‌ ఉందని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని