IPL 2022 Auction: ఆ కుర్రాళ్లు.. కోటీశ్వరులు

రికార్డు స్థాయిలో భారత్‌కు అయిదోసారి అండర్‌-19 ప్రపంచకప్‌ అందించిన కుర్రాళ్లలో ఇద్దరిపై ఫ్రాంఛైజీల రూ.కోట్ల వర్షం కురిపించాయి. పేస్‌ ఆల్‌రౌండర్లు రాజ్‌ బవా, రాజ్‌వర్ధన్‌ హంగార్గేకర్‌ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి.

Updated : 14 Feb 2022 08:14 IST

రికార్డు స్థాయిలో భారత్‌కు అయిదోసారి అండర్‌-19 ప్రపంచకప్‌ అందించిన కుర్రాళ్లలో ఇద్దరిపై ఫ్రాంఛైజీల రూ.కోట్ల వర్షం కురిపించాయి. పేస్‌ ఆల్‌రౌండర్లు రాజ్‌ బవా, రాజ్‌వర్ధన్‌ హంగార్గేకర్‌ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ కుర్రాడు రాజ్‌ బవాను రూ.2 కోట్లకు పంజాబ్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది. మహారాష్ట్ర ఆటగాడు రాజ్‌వర్ధన్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ.1.5 కోట్లు ఖర్చుపెట్టింది. అయితే కుర్రాళ్ల జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్‌ యశ్‌ ధుల్‌కు ఊహించిన దాని కంటే తక్కువ ధరే దక్కిందని చెప్పాలి. దిల్లీకి చెందిన అతణ్ని దిల్లీ క్యాపిటల్స్‌ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. కర్ణాటక బ్యాటర్‌ అనీశ్వర్‌ గౌతమ్‌ను ఆర్సీబీ కనీస ధర రూ.20 లక్షలకు దక్కించుకుంది. మరోవైపు విక్కీ, హర్నూర్‌ సింగ్‌, కౌశల్‌ తాంబె లాంటి ఆటగాళ్లపై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని