IPL 2022 Auction: అప్పుడు బిడ్డింగ్‌ ఆగిపోవాలనుకున్నా: దీపక్‌ చాహర్‌

వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తనకు రూ.13 కోట్లు పెట్టినప్పుడు బిడ్డింగ్‌ ఆగిపోవాలని కోరుకున్నానని ఆ జట్టు పేసర్‌ దీపక్‌ చాహర్‌ అన్నాడు.

Updated : 15 Feb 2022 07:37 IST

దిల్లీ: వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తనకు రూ.13 కోట్లు పెట్టినప్పుడు బిడ్డింగ్‌ ఆగిపోవాలని కోరుకున్నానని ఆ జట్టు పేసర్‌ దీపక్‌ చాహర్‌ అన్నాడు. ‘‘ఐపీఎల్‌ వేలంలో ఒక దశకు వచ్చిన తర్వాత బిడ్డింగ్‌ ఆగిపోవాలని కోరుకున్నా. అప్పటికే నా ధర రూ.13 కోట్లుగా ఉంది. ఈ స్థితిలో బిడ్డింగ్‌ ఆపేస్తే చెన్నై సొంతమయ్యే అవకాశం ఉంది. ఇలా జరిగితే మిగిలిన డబ్బులతో ఇంకా ఎక్కువమంది ఆటగాళ్లను కొనచ్చు. ఒక ఆటగాడిగా జట్టు బలంగా ఉండాలని కోరుకుంటా. చెన్నై తప్ప వేరే జట్టుకు ఆడడాన్ని ఊహించలేను. 2018లో తొలిసారి శ్రీనివాసన్‌ సార్‌ను కలిసినప్పుడు ‘నువ్వెప్పుడూ పసుపు జెర్సీలోనే ఆడతావు’ అన్నారు. ఆ మాటలని బట్టి చెన్నై నా కోసం తప్పకుండా బిడ్‌ వేస్తుందని ఊహించా’’ అని చాహర్‌ అన్నాడు. వేలంలో రికార్డు స్థాయిలో రూ.14 కోట్లు పెట్టి చెన్నై జట్టు దీపక్‌ను చేజిక్కించుకుంది. ఇంత భారీ ధరకు అమ్ముడుపోయిన తొలి భారత బౌలర్‌ అతడే. 2018లో రూ.80 లక్షలతో అతడిని తొలిసారి కొన్న దగ్గర నుంచి చెన్నైకు ప్రాతినిధ్యం వహించడం చాహర్‌కు ఇది అయిదోసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని