Shreyas Iyer: కోల్‌కతా కెప్టెన్‌గా శ్రేయస్‌

టీమ్‌ఇండియా ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇటీవలే ఆటగాళ్ల వేలంలో రూ.12.25 కోట్లకు అయ్యర్‌ను కొనుగోలు చేసిన కోల్‌కతా.. అతనికి సారథ్య బాధ్యతలు 

Updated : 17 Feb 2022 07:05 IST

కోల్‌కతా: టీమ్‌ఇండియా ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇటీవలే ఆటగాళ్ల వేలంలో రూ.12.25 కోట్లకు అయ్యర్‌ను కొనుగోలు చేసిన కోల్‌కతా.. అతనికి సారథ్య బాధ్యతలు అప్పగించింది. 2020లో దిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయస్‌ ఆ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఐపీఎల్‌లో దిల్లీకి అదే అత్యుత్తమ ప్రదర్శన. అనంతరం రిషబ్‌ పంత్‌కు సారథ్యం అప్పగించడంతో దిల్లీని వీడిన అయ్యర్‌ వేలంలోకి వచ్చాడు. భారీ మొత్తానికి అయ్యర్‌ను సొంతం చేసుకున్న కోల్‌కతా.. ఇయాన్‌ మోర్గాన్‌ స్థానంలో అతడిని సారథిగా నియమించింది. ‘‘కోల్‌కతా వంటి ప్రతిష్టాత్మక జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నా. భిన్న దేశాలు, సంస్కృతులకు చెందిన అత్యుత్తమ ఆటగాళ్లను ఐపీఎల్‌ ఒకచోటికి చేరుస్తుంది. ఈ ప్రతిభావంతుల బృందానికి సారథ్యం వహించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని అయ్యర్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు