Rajvardhan Hangargekar: హంగార్గేకర్‌ మోసం చేశాడా?

అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో కీలక సభ్యుడైన పేసర్‌ రాజ్యవర్ధన్‌ హంగార్గేకర్‌పై అనూహ్యమైన ఆరోపణలు! వయసు దాచి మోసం చేశాడని.. నిబంధనలకు విరుద్ధంగా ప్రపంచకప్‌ ఆడాడని హంగార్గేకర్‌పై

Updated : 20 Feb 2022 07:14 IST

ముంబయి: అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో కీలక సభ్యుడైన పేసర్‌ రాజ్యవర్ధన్‌ హంగార్గేకర్‌పై అనూహ్యమైన ఆరోపణలు! వయసు దాచి మోసం చేశాడని.. నిబంధనలకు విరుద్ధంగా ప్రపంచకప్‌ ఆడాడని హంగార్గేకర్‌పై మహారాష్ట్ర క్రీడల కమిషనర్‌ ఓం ప్రకాశ్‌ బకోరియా ఆరోపించారు. అతడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా బీసీసీఐకి లేఖ రాశారు. రాజ్యవర్ధన్‌ పుట్టిన రోజు జనవరి 10, 2001 కాగా.. దాన్ని నవంబర్‌ 10, 2002గా మార్చినట్లు.. వయసు మీరినా కూడా అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆడినట్లు బీసీసీఐ కార్యదర్శి జైషాకు రాసిన లేఖలో ఓం ప్రకాశ్‌ పేర్కొన్నారు. ‘‘మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లోని టెర్నా పబ్లిక్‌ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరినప్పుడు హంగార్గెకర్‌ పుట్టిన రోజు 10/1/2001గా రికార్డుల్లో నమోదై ఉంది. ఏడో తరగతి వరకు అతడిది ఇదే జన్మదినం. కానీ ఎనిమిదో తరగతిలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనధికారికంగా ఈ తేదీని 10/11/2002గా మార్చారు. ఇలా పుట్టినరోజును సవరించేటప్పుడు సంబంధిత జిల్లా విద్యా శాఖ అధికారి నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఈ ధ్రువపత్రం ఆధారంగా అండర్‌-19 జట్టులో చోటు దక్కించుకున్న రాజ్యవర్ధన్‌.. ఆ తర్వాత ప్రపంచకప్‌లోనూ ఆడాడు’’ అని ఓం ప్రకాశ్‌ ఆరోపించారు. అండర్‌-19 ప్రపంచకప్‌లో సత్తా చాటిన హంగార్గేకర్‌ను ఇటీవల ఐపీఎల్‌వేలంలో చెన్నై రూ.1.5 కోట్లకు కొనుక్కుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని