Leander Paes: మాజీ భాగస్వామిని పేస్‌ హింసించాడు

భారత దిగ్గజ టెన్నిస్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌ తన మాజీ భాగస్వామి రియా పిల్లైని వివిధ రకాలుగా గృహ హింసకు గురి చేశాడని మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు తీర్పు వెల్లడించింది. రియాకు నెలవారీ నిర్వహణ ఖర్చులకు గాను రూ.లక్ష

Updated : 26 Feb 2022 07:10 IST

ముంబయి: భారత దిగ్గజ టెన్నిస్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌ తన మాజీ భాగస్వామి రియా పిల్లైని వివిధ రకాలుగా గృహ హింసకు గురి చేశాడని మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు తీర్పు వెల్లడించింది. రియాకు నెలవారీ నిర్వహణ ఖర్చులకు గాను రూ.లక్ష చెల్లించాలని పేస్‌ను ఆదేశించింది. అంతే కాకుండా ఇద్దరు కలిసి ఉంటున్న ఇంటి నుంచి రియా వెళ్లిపోవాలని అనుకుంటే ఆమెకు ఇంటి అద్దె కింద మరో రూ.50 వేలు ఇవ్వాలని తెలిపింది. ఒకవేళ ఆమె అదే ఇంట్లో ఉండాలి అనుకుంటే డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఎనిమిదేళ్లు సహజీవనం చేసిన తర్వాత 2014లో పేస్‌ తనను హింసిస్తున్నాడని రియా కోర్టును ఆశ్రయించింది. గృహ హింస నుంచి మహిళలకు రక్షణ చట్టం ప్రకారం తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. పేస్‌ తన చర్యలు, ప్రవర్తన ద్వారా ఆమెను అన్ని రకాలుగా దూషించాడని, దీంతో తనకు మానసిక క్షోభ కలిగిందని రియా ఆరోపణలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోమల్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఈ నెల ఆరంభంలో ఆదేశాలు జారీ చేయగా.. అవి తాజాగా వెలుగులోకి వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని