Vladimir Putin: పుతిన్‌కు షాక్‌

ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యాకు క్రీడల పరంగా దెబ్బ పడుతూనే ఉంది. ఇప్పటికే వివిధ అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు ఆ దేశంలో నిర్వహించాల్సిన టోర్నీలను, మ్యాచ్‌లను వేరే దేశాలకు తరలించడమో లేదా రద్దు చేయడమో చేస్తున్నాయి.

Published : 28 Feb 2022 07:09 IST

బుడాపెస్ట్‌: ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యాకు క్రీడల పరంగా దెబ్బ పడుతూనే ఉంది. ఇప్పటికే వివిధ అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు ఆ దేశంలో నిర్వహించాల్సిన టోర్నీలను, మ్యాచ్‌లను వేరే దేశాలకు తరలించడమో లేదా రద్దు చేయడమో చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు అంతర్జాతీయ జూడో సమాఖ్య (ఐజేఎఫ్‌) షాకిచ్చింది. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించడాన్ని నిరసిస్తూ తమ సమాఖ్య గౌరవ అధ్యక్షుడిగా ఉన్న ఉన్న పుతిన్‌ను సస్పెండ్‌ చేసినట్లు ఐజేఎఫ్‌ ఆదివారం ప్రకటించింది. దీంతో క్రీడల్లో తన అత్యంత సీనియర్‌ హోదాను తాత్కాలికంగా పుతిన్‌ కోల్పోయారు. జూడో అభిమాని అయిన పుతిన్‌.. 2012 లండన్‌ ఒలింపిక్స్‌ సందర్భంగా స్టేడియానికి వెళ్లి మరీ అథ్లెట్ల పోరాటాలను వీక్షించారు. మరోవైపు పుతిన్‌ స్నేహితుడు అర్కాడీ రోటెన్‌బర్గ్‌ మాత్రం ఐజేఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో అభివృద్ధి మేనేజర్‌గా కొనసాగుతున్నారు. ఇప్పటికే రష్యా, బెలారస్‌లో నిర్వహించాల్సిన టోర్నీలను అక్కడి నుంచి తరలించాలని లేదా రద్దు చేసుకోవాలని క్రీడా సమాఖ్యలను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ కోరిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని