Nutakki Priyanka: ప్రియాంక మహిళా గ్రాండ్‌మాస్టర్
తెలుగు తేజం నూతక్కి ప్రియాంక ‘డబ్ల్యూజీఎం’ (మహిళా గ్రాండ్‌మాస్టర్) టైటిల్‌ను కైవసం చేసుకుంది. బుధవారం భువనేశ్వర్‌లో ముగిసిన 47వ జాతీయ మహిళా చెస్ ఛాంపియన్‌షిప్‌లో విజయవాడకు చెందిన ప్రియాంక తొమ్మిది రౌండ్ల నుంచి ఏడు పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: తెలుగు తేజం నూతక్కి ప్రియాంక ‘డబ్ల్యూజీఎం’ (మహిళా గ్రాండ్‌మాస్టర్) టైటిల్‌ను కైవసం చేసుకుంది. బుధవారం భువనేశ్వర్‌లో ముగిసిన 47వ జాతీయ మహిళా చెస్ ఛాంపియన్‌షిప్‌లో విజయవాడకు చెందిన ప్రియాంక తొమ్మిది రౌండ్ల నుంచి ఏడు పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. డబ్ల్యూజీఎం మూడో నార్మ్నూ సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు మహిళల గ్రాండ్‌మాస్టర్ హోదా ఖరారైంది. 2301 ఎలో రేటింగ్‌తో ఉన్న ప్రియాంక ఈ ఛాంపియన్షిప్ ద్వారా మరో 25 పాయింట్లు తన ఖాతాలో జమ చేసుకుంది.
సంయుక్త ఆధిక్యంలో అర్జున్, గుకేశ్: జాతీయ సీనియర్ చెస్ ఛాంపియన్షిప్ ఆసక్తికరంగా సాగుతోంది. మరో రౌండ్ మాత్రమే మిగిలివున్న ఈ టోర్నీలో తెలుగు కుర్రాడు అర్జున్ ఎరిగైసి (తెలంగాణ), గుకేశ్ (తమిళనాడు) సంయుక్తంగా ఆధిక్యంలో నిలిచారు. పది రౌండ్లు పూర్తయ్యేసరికి అర్జున్, గుకేశ్ ఎనిమిదేసి పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు. బుధవారం పదో రౌండ్లో ఇనియాన్ (తమిళనాడు)తో గేమ్‌ను అర్జున్ డ్రా చేసుకోగా.. అభిజీత్ గుప్తాపై గుకేశ్ విజయం సాధించాడు. డిఫెండింగ్ ఛాంపియన్ అరవింద్ చిదంబరం, మాజీ విజేత సేతురామన్, ఆర్యన్ చోప్రా, మిత్రభా గుహ, ఇనియాన్, విశాఖ్, ప్రణవ్‌లు 7.5 పాయింట్లతో ఉమ్మడిగా తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు. గురువారం చివరి రౌండ్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్