Russia: వింటర్‌ పారాలింపిక్స్‌ నుంచి రష్యా, బెలారస్‌ ఔట్‌

ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యాపై రోజు రోజుకూ వ్యతిరేక పెరుగుతోంది. తాజాగా వింటర్‌ పారాలింపిక్స్‌ నిర్వాహకులు ఆ దేశంతో పాటు బెలారస్‌లను క్రీడల నుంచి బహిష్కరించారు. ఆ దేశాలను కొనసాగనిస్తే తాము క్రీడలను ఉపసంహరించుకుంటామని

Updated : 04 Mar 2022 07:21 IST

(Photo: Beijing 2022 Twitter)

బీజింగ్‌: ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యాపై రోజు రోజుకూ వ్యతిరేక పెరుగుతోంది. తాజాగా వింటర్‌ పారాలింపిక్స్‌ నిర్వాహకులు ఆ దేశంతో పాటు బెలారస్‌లను క్రీడల నుంచి బహిష్కరించారు. ఆ దేశాలను కొనసాగనిస్తే తాము క్రీడలను ఉపసంహరించుకుంటామని అనేక దేశాలు బెదిరించడం, క్రీడా గ్రామంలో శత్రుత్వం పెరగడమే అందుకు కారణం. తటస్థ అథ్లెట్లుగా రష్యా, బెలారస్‌ ఆటగాళ్లను క్రీడల్లో ఆడనిస్తామని బుధవారమే చెప్పిన పారాలింపిక్‌ కమిటీ.. ఒక్క రోజులోనే నిర్ణయం మార్చుకుంది. ‘‘యుద్ధ ప్రభావం ఇప్పుడు క్రీడలపైనా పడుతోంది. యుద్ధం నుంచి క్రీడల నుంచి కాపాడాలనుకుంటున్నాం. క్రీడా గ్రామంలో ప్రత్యేకంగా ఎలాంటి ఘటనలూ జరగలేదు. ఏ అథ్లెట్‌ కూడా దూకుడుగా వ్యవహరించలేదు. కానీ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అనేక జట్లు క్రీడల నుంచి ఉపసంహరించుకుంటామని, బహిష్కరిస్తామని అంటున్నాయి. ఈ బెదిరింపుల వల్ల క్రీడలను కొనసాగించడమే కష్టంగా మారింది. అందుకే మా నిర్ణయం మార్చుకున్నాం. క్రీడా గ్రామంలో వాతావరణం ఆహ్లాదభరితంగా లేదు’’ ఐపీసీ అధ్యక్షుడు పార్సన్స్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని