IPL 2022: ముందు దేశం.. తర్వాతే ఐపీఎల్‌

క్షిణాఫ్రికా ఆటగాళ్లు వచ్చే ఐపీఎల్‌ కన్నా బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆ జట్టు టెస్టు కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ అన్నాడు. ఇది ఆటగాళ్ల విధేయతకు పరీక్షని చెప్పాడు. దక్షిణాఫ్రికా మార్చి 18 నుంచి బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడాల్సివుంది. మార్చి 18, 20, 23వ తేదీల్లో వన్డేలు ఉంటాయి

Updated : 08 Mar 2022 07:00 IST

జొహానెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వచ్చే ఐపీఎల్‌ కన్నా బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆ జట్టు టెస్టు కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ అన్నాడు. ఇది ఆటగాళ్ల విధేయతకు పరీక్షని చెప్పాడు. దక్షిణాఫ్రికా మార్చి 18 నుంచి బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడాల్సివుంది. మార్చి 18, 20, 23వ తేదీల్లో వన్డేలు ఉంటాయి. మార్చి 31న మొదటి టెస్టు, ఏప్రిల్‌ 12న రెండో టెస్టు ఆరంభమవుతాయి. కానీ ఐపీఎల్‌ మార్చి 26 నుంచి మే 29 వరకు జరుగుతుంది. బంగ్లాతో ఆడాలా లేదా చాలా డబ్బులొచ్చే ఐపీఎల్‌లో ఆడాలా అన్న నిర్ణయాన్ని క్రికెట్‌ దక్షిణాఫ్రికా క్రికెటర్లకే వదిలేసినట్లు తెలుస్తోంది. ‘‘ఎందులో ఆడాలో నిర్ణయించుకోవడం చాలా కష్టమే. కానీ ఆటగాళ్ల విధేయత ఎటో ఇప్పుడే మనకు తెలుస్తుంది. తమను ఐపీఎల్‌లోకి తెచ్చిన టెస్టు క్రికెట్‌ లేదా వన్డే క్రికెట్‌ను ఆటగాళ్లు మరువకూడదు. ఐపీఎల్‌ కోసం టెస్టు లేదా వన్డే క్రికెట్‌ను విస్మరించరాదు’’ అని ఎల్గర్‌ అన్నాడు. రబాడ, ఎంగిడి, నార్జ్‌ డికాక్‌ సహా 11 మంది దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వివిధ ఐపీఎల్‌ జట్లలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని